MDK: “ఎవరు అడ్డుకున్నా విద్యార్థుల సమస్యలపై మా పోరాటం ఆగదు” అని ఏబీవీపీ స్టేట్ ఖేల్ కో-కన్వీనర్ ప్రశాంత్ స్పష్టం చేశారు. రామాయంపేట బస్టాండ్ వద్ద పోలీసులు నిరసనను అడ్డుకోవడంతో ఆయన మండిపడ్డారు. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విద్యాశాఖకు 15 శాతం నిధులు కేటాయించాలని, స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.