»Ap State Administration Start Dasara Onwards At Vizag
Vizag నుంచి పాలనకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?
దసరా నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీర్మానం చేసింది. ఎన్నికలకు కొద్దీరోజుల ముందు జగన్ సర్కార్ కీలక ముందడుగు వేసింది.
Vizag: ఎట్టకేలకు జగన్ (Vizag) సర్కార్ విశాఖ నుంచి పరిపాలన చేయనుంది. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మండలిలో తీర్మానం విగిపోవడం.. కోర్టుల చుట్టూ వ్యవహారం నడవడంతో ఇన్నాళ్లూ వాయిదా పడింది. దసరా (dasara), దీపావళి (diwali), సంక్రాంతి (sankranthi) అంటూ వాయిదాల పర్వం కొనసాగింది. తాజాగా ఈ 2023 దసరా నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన కొనసాగిస్తామని సీఎం జగన్ (jagan) స్పష్టంచేశారు.
విశాఖలో సీఎం నివాసం, ఇతర నిర్మాణాలు జరుగుతున్నాయి. దసరా లోపు ముఖ్యమైన నిర్మాణాలు జరుగుతాయి. దసరా రోజున సుముహూర్త విశాఖ నుంచి రివ్యూ చేస్తారు. విశాఖలో కార్యాలయాల నిర్ధారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు ఉంటుందన్నారు. దసరా పర్వదినం నాటికి కార్యాలయాల తరలింపు పూర్తి కావాలన్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన తాడేపల్లిలో ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలను సీరియస్గా తీసుకోవాలని సూచించారు. సంబంధిత మంత్రులు అన్ని అంశాలతో సభకు రావాలన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రులకు సూచించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుంభకోణాలపై అసెంబ్లీ వేదికగా చర్చిద్దామన్నారు. కాగా, రేపటి నుంచి ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.
మరో ఏడు, ఎనిమిది నెలల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో సీఎం జగన్ (jagan) కీలక నిర్ణయం తీసుకొని ముందడుగు వేశారు. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో.. పాలన ప్రారంభం అయినట్టే అవుతుంది. ఇదివరకు సభలు, సమావేశాల్లో వివిధ తేదీలు చెప్పడంతో.. వాయిదాల పర్వం కొనసాగింది.
అమరావతి రాజధాని మార్చొద్దని రైతులు పోరాటం చేస్తున్నారు. కోర్టు కేసులు నడుస్తున్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లాయి. గత నాలుగేళ్ల కోర్టు కేసుల చుట్టూ సమయం గడిచింది. అందుకే విశాఖ వచ్చేందుకు వీలు కాలేదు. ఇప్పుడు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయంతో పరిపాలన ప్రారంభించనున్నారు.