Drugs: డ్రగ్స్ (Drugs) దందాలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్ పెడ్లర్స్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. గత నెల 31వ తేదీన మాదాపూర్ సర్వీస్ అపార్ట్మెంట్స్ వద్ద రేవ్ పార్టీలతో మత్తు దందా బయటపడిన సంగతి తెలిసిందే. దాంతో టాలీవుడ్ లింకులు ఒక్కొక్కటీ వెలుగులోకి వచ్చాయి. అరెస్టయిన బాలాజీ, వెంకటరత్నారెడ్డి మొబైల్లో గల నంబర్లు, వాంగ్మూలం ఆధారంగా సినీ, రాజకీయ ప్రముఖులతో లింకులు బయటపడ్డాయి. ముగ్గురు నైజీరియన్లు సహా 8 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
గోవా, ముంబై నుంచి ఇప్పుడు డ్రగ్స్ (Drugs) దందా బెంగళూర్‌కు మకాం మారింది. నైజీరియన్లు బెంగళూర్ చేరగానే నకిలీ పాస్ పోర్ట్, వీసా తయారు చేయిస్తారు. అక్కడ ఇళ్లు అద్దెకు తీసుకుంటారు. తమ దేశానికి చెందిన సిమ్ కార్డు ఉపయోగించి వైఫై వాట్సాప్, షేర్ చాట్ ద్వారా పెడ్లర్స్, ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతారు. అవీ ఛాటింగ్ ఎన్‌క్రిప్ట్‌లో ఉండటంతో పోలీసులు గుర్తించడం లేదు. సరకు ఆర్టర్ చేయడానికి బకరా, కోక్, శాండిల్ వంటి కోడ్ బాష ఉపయోగిస్తున్నారు. చేతికి నగదు వచ్చిన తర్వాత సరకు ఎక్కడ తీసుకోవాలో చెబుతారు. నిర్ధేశించిన ప్రదేశాల్లో కిరాణా, పాన్, పాల షాప్ వద్ద డ్రగ్స్ ప్యాకెట్లు అందజేస్తారు. ఆ షాపు వ్యక్తికి కొంత కమీషన్ ఇస్తారు. కొందరు మాత్రం నిర్మానుష్య ప్రాంతాల్లో పొట్లాలు ఉంచి దూరం నుంచి గమనిస్తుంటారు. లావాదేవీ పూర్తయినట్ట ధృవీకరించేందుకు బ్రో అనే ఇండికేషన్ ఉపయోగిస్తున్నారని తెలిసింది.
మాదాపూర్ డ్రగ్స్ (Drugs) దందాలో విశాఖపట్నానికి లింకులు బయటపడ్డాయి. ఈవెంట్ మేనేజర్ లహర్ రెడ్డి, సినీ నిర్మాత వెంకటరత్నారెడ్డి, రాము అలియాస్ రాంచందర్ నేతృత్వంలో వైజాగ్‌లో రేవ్ పార్టీ నిర్వహించారని తెలిసింది. మోడల్స్, సినీ తారలను ఆకర్షణగా ఉంచి.. మత్తులో దింపేవారని తెలిసింది. ఆ పార్టీలకు రాజకీయ నేతలు, నేతలు హాజరయ్యారని గుర్తించారు. నిందితుల కాల్ డేటాలో వైజాగ్, గుంటూరు, నెల్లూరుకు చెందిన నేతల పేర్లు ఉన్నాయని తెలిసింది.