TG: రంజాన్ సందర్భంగా HYD పాతబస్తీలో నెల రోజులు సందడిగా మారిన నైట్ బజార్ రేపటితో ముగియనుంది. చార్మినార్, లాడ్ బజార్ ప్రాంతాలు రాత్రివేళల్లో కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. రేపు రంజాన్ కావడంతో ఈ ప్రత్యేక నైట్ షాపింగ్‌కు తెరపడనుంది. రేపటి నుంచి మిడ్నైట్ వరకే దుకాణాలు కొనసాగుతాయి. మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో సాయంత్రం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.