»Shocking Decreasing Sale Of Jockey Rupa Dollar Underwear
Underwear: పడిపోయిన అండర్ వేర్ అమ్మకాలు.. పెరిగిన డేటింగ్ సైట్ల సంపాదన
దేశ ఆర్థిక వ్యవస్థ పడిపోయినప్పుడల్లా, లోదుస్తుల అమ్మకాలు కూడా పడిపోతాయి. ఆర్థిక వ్యవస్థ క్షీణించడంతో డేటింగ్ వెబ్సైట్ల ఆదాయం కూడా పెరుగుతుందని నివేదికలు వెల్లడించాయి.
Underwear: మనిషి లోదుస్తులు అతని శరీరానికే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా ముఖ్యమైనవి. అయితే ఆర్థిక వ్యవస్థతో పాటు పురుషుల లోదుస్తుల విక్రయానికి ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారా.. దాని గురించి తెలుసుకుందాం. వాస్తవానికి, భారతదేశంలో లోదుస్తుల విక్రయాలలో భారీ క్షీణత ఉంది. ఇంకా షాకింగ్ ఏంటంటే.. లోదుస్తుల అమ్మకాలు తగ్గిన వెంటనే డేటింగ్ వెబ్సైట్లు భారీగా ఫేమస్ అవుతున్నాయి. వినడానికి ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రూపా, డాలర్, జాకీతో సహా దేశంలోని అన్ని లోదుస్తుల బ్రాండ్ల అమ్మకాల్లో భారీ క్షీణత ఉంది. ఏ దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించినా ఆ దేశపు పురుషుల లోదుస్తుల సూచికలో దాని సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి. ప్రజలు లోదుస్తుల వంటి అదృశ్య వస్తువులను కొనడం మానుకుంటారు. ఈ డబ్బును వారు ఏదైనా అత్యవసర వస్తువులపై ఖర్చు చేయడం మంచిదని భావిస్తున్నారు. ఇప్పుడు అది డేటింగ్ వెబ్‌సైట్‌కి ఎలా కనెక్ట్ చేయబడిందో చూద్దాం.
ఆర్థిక సూచికల ప్రకారం.. దేశ ఆర్థిక వ్యవస్థ పడిపోయినప్పుడల్లా, లోదుస్తుల అమ్మకాలు కూడా పడిపోతాయి. ఆర్థిక వ్యవస్థ క్షీణించడంతో డేటింగ్ వెబ్సైట్ల ఆదాయం కూడా పెరుగుతుందని నివేదికలు వెల్లడించాయి. మాంద్యం కారణంగా ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోవడం ప్రారంభిస్తారు. దీని కారణంగా ప్రజలు ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. అటువంటి పరిస్థితిలో వారు తమ సమయాన్ని గడపడానికి డేటింగ్ వెబ్సైట్లను ఉపయోగిస్తున్నారు. దీని కారణంగా డేటింగ్ వెబ్సైట్లు బాగా లాభాలు పొందుతాయి. 2009లో అమెరికాలో మార్కెట్ తిరోగమనం సమయంలో Match.com నాల్గవ త్రైమాసిక లాభం గత ఏడు సంవత్సరాలలో అత్యధిక లాభాలను గడించింది. ఈ కాలంలో దేశంలో మాంద్యం ఏర్పడి ప్రజల ఉద్యోగాలు కోల్పోవడం మొదలైంది. తమను తాము బిజీగా ఉంచుకోవడానికి ప్రజలు డేటింగ్ వెబ్సైట్లను ఆశ్రయించారు. 2001లో సెప్టెంబర్ 11 దాడుల తర్వాత కూడా, Match.comలో ట్రాఫిక్ పెరిగింది.