Congress Poster: సీడబ్ల్యూసీ సమావేం.. తుక్కుగూడలో విజయభేరి సభ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారు. అగ్రనేతల రాకతో తమకు కలిసి వస్తోందని అనుకుంటున్నారు. గిట్టనివారు పెట్టిన పోస్టర్లు వెలిశాయి. గతంలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ల పేరుతో పోస్టర్లు.. అదీ సోనియా, రాహుల్ బస చేసిన బంజారాహిల్స్ వద్ద వెలిశాయి. ఆ పోస్టర్లు (posters) చూస్తే.. సోనియా, రాహుల్కు చిర్రెత్తడం ఖాయం.
గతంలో.. టీడీపీలో ఉన్న సమయంలో సోనియా గాంధీ (sonia), రాహుల్ గాంధీని (rahul gandhi) అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఏకీపారేశారు. సోనియా గాంధీని బలి దేవత అని.. రాహుల్ గాంధీని ముద్దపప్పు అని అభివర్ణించారు. కొన్నాళ్ల పోయింది.. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం.. తర్వాత పీసీసీ చీఫ్ పదవీ చేపట్టడం చక చకా జరిగిపోయాయి. కానీ గతంలో రేవంత్ అన్న మాటలతో పోస్టర్లు వెలిశాయి. దీంతో సొంత పార్టీలోనే చర్చకు దారితీసింది.
రాహుల్ గాంధీ ఫోటో పెట్టి.. కింద రేవంత్ నమస్కారం చేస్తున్నట్టు మరో పిక్ ఉంది. దానిపై ముద్దపప్పుకు స్వాగతం అని ఉంది. మరో పోస్టర్లో సోనియాను బలిదేవతకు స్వాగతం అని రాసి ఉంది. ఆ పోస్టర్లు కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేశాయి. పార్టీ క్రమంగా బలపడుతుందని అనుకుంటే.. సరిగ్గా ఈ సమయంలో పోస్టర్లు ఏంటీ అని మదన పడుతున్నారు. గిట్టనివారు.. కావాలని ఇలా చేశారని విరుచుకుపడ్డారు.
సీడబ్ల్యూసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీ లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో మీటింగ్ జరగాల్సి ఉంది. కానీ హైదరాబాద్కు ప్రయారిటీ ఇచ్చి.. ఇక్కడ మీటింగ్ నిర్వహించారు. తెలంగాణ విమోచన దినోత్సాన్ని పురస్కరించుకొని.. సభ కూడా ఏర్పాటు చేశారు. ఆరు గ్యారెంటీలను సోనియా గాంధీ ప్రకటిస్తారు.