NLG: నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని అనుముల, పెద్దవూర, త్రిపురారం, నిడమనూరు మండలాల్లో ఈసారి మిర్చి సాగు గణనీయంగా పెరిగింది. అనుకూల వాతావరణం, మంచి ధరల ఆశతో రైతులు విస్తృతంగా మిర్చి పంటను సాగు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో మిర్చి ధరలు పెరిగి రైతులకు లాభాలు అందిస్తున్నాయి.