Isro Chief Somanath Get Rs 2.5 Lakhs Monthly Salary
Isro Chief: చంద్రయాన్-3 సక్సెస్.. తర్వాత వెంటనే ఆదిత్య ప్రయోగంతో ఇస్రో కీర్తి మరింత పెరిగింది. ఇందుకు కారణం శాస్త్రవేత్తలు, ఇస్రో చీఫ్ (Isro Chief) సోమనాథ్ (somanath) అనే సంగతి తెలిసిందే. దేశం కోసం వారు అహార్నిసలు శ్రమిస్తున్నారు. మరీ శాస్త్రవేత్తల వేతనం గురించి మీకు తెలుసా..? ఇదే విషయాన్ని ప్రముఖ వ్యాపార వేత్త హర్ష గోయెంకా పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ నెట్టింట చర్చకు దారితీసింది.
ఇస్రో చీఫ్ సోమనాథ్ (somanath) నెలకు రూ.2.50 లక్షల జీతం పొందుతున్నారని హర్ష గోయెంకా (Harsh Goenka) వివరించారు. ఇదీ ఆయనకు సరైన జీతమా..? అని అడిగారు. డబ్బే కాకుండా ఉన్నతమైన ఎన్నో అంశాలు ఆయన లాంటి వ్యక్తులను ప్రేరేపిస్తాయని అర్థం చేసుకోవచ్చు. సాంకేతికత, పరిశోధనల్లో అంకితభావంతో ఆయన కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దేశం గర్వపడేలా వారు చేస్తున్నారు.. సోమనాథ్ లాంటి వ్యక్తులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని గోయెంకా ట్వీట్ చేశారు.
హర్ష గోయెంకా (Harsh Goenka) పోస్ట్‌ను 7 లక్షల మంది చూశారు. అంకితభావం, నిబద్ధతలే ఆయనను అభివృద్ధి వైపు నడిపిస్తున్నాయి. వాటికి డబ్బు కొలమానం కాదు. సాంకేతికత, పరిశోధనలు.. దేశాభివృద్ధి కోసం కృషి చేస్తారని ఒకరు రాశారు. సోమనాథ్ లాంటి వారు ఇల్లు, కారు, డబ్బు కోసం కాకుండా దేశం కోసం పనిచేస్తున్నారని మరకొరు రాశారు. సోమనాథ్ లాంటి వారికి నెలకు రూ.2.50 లక్షలు కాదు.. నెలకు రూ.25 లక్షల కన్నా ఎక్కువ జీతం రావాలని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.
సోమనాథ్ సామర్థ్యానికి తగి ప్రోత్సాహకం దక్కాలని కోరుకుంటున్నానని మరొకరు రాశారు. సోమనాథ్ లాంటి వారి ప్రైవేట్ రంగంలో ఉంటే, ఆయన సామర్థ్యంతో ఎక్కువే సంపాదిస్తారని మరొకరు రాశారు. నిజమే సోమనాథ్, ఇతర శాస్త్రవేత్తలు దేశం కోసం పనిచేస్తున్నారు. వారికి దేశ హితమే ముఖ్యం అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.