Food delivery జొమాటో(Zomato), స్విగ్గీ(Swiggy) వంటి ఆన్లైన్ డెలివరీలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారే కాదు, వాటి ద్వారా సంపాదించుకునే వారు కూడా ఎక్కువైపోయారు. దీంతో కొంతమంది తమ లగ్జరీ బైకులపై డెలివరీ చేస్తున్నారు. వారిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వారికి వచ్చే సంపాదన అంతా పెట్రోల్‌కే ఖర్చు అవుతుందని మరికొందరు భావిస్తున్నారు. కాని నిజం వేరు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే అసలు విషయం మీకే అర్థం అవుతుంది.
ఇన్స్టాగ్రామ్(Instagram) యూజర్ రాజ్ గోథాంకర్ పోస్ట్ చేసిన ఈ వీడియో చూసినట్లయితే ఇందులో ఖరీదైన డుకాటి కంపెనీ బైక్ కనిపిస్తుంది. దీని ధర సుమారు రూ. 10 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది. దీనిపైన కూర్చున్న డెలివరీ బాయ్ జొమాటో షర్ట్ ధరించి ఉన్నాడు. అతడు తన ప్రతి ఆర్డర్‌కు 200 వరకు సంపాదిస్తున్నట్లు, అందులో రూ. 50 పెట్రోలు కోసం వెచ్చించినా.. తనకి రూ. 150 మిగులుతుందని.. ఇలా రోజుకి 20 ఆర్డర్స్ డెలివరీ చేస్తానని చెప్పాడు. అంటే అతడు నెలకు రూ. 45,000 సంపాదిస్తానని చెప్పాడు. నిజానికి ప్రతి ఆర్డర్‌కు రూ. 30 నుంచి రూ. 40 మాత్రమే వస్తుందని తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.