SKLM: వేసవిలో జాగ్రత్తలు పాటించాలని ప్రముఖ మూత్ర పిండాల వ్యాధి నిపుణులు డాక్టర్ బెందాలం గౌతమి సూచించారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి-జాగ్రత్తలు అవగాహన సభలో ఆమె మాట్లాడారు. దాహం వేయకపోయినా రోజుకి మూడు నుండి నాలుగు లీటర్ల నీరు, కొబ్బరి నీరు వంటివి త్రాగాలని సూచించారు.