శ్రీకాకుళంలోని డా.బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవ్-2026 వేడుకలను అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, స్థానిక ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అనంతరం పలువురు కళాకారులకు, కవులకు సన్మానం చేశారు.