BHNG: మోత్కూర్లో ఉగాది పండుగను విభిన్నంగా జరుపుకోవడం శతాబ్దాల నుంచి వస్తోన్న ఆచారం. ఉగాది వేళ గ్రామంలోని ముత్యాలమ్మకు బోనాలు సమర్పించి, కోళ్లు, మేకలను బలి ఇస్తారు. ఎడ్ల బండ్లలను తిప్పుతూ సంబరాలు చేస్తారు. పూర్వకాలంలో ఈ గ్రామంలో మశూచి తాండవించిందని, వ్యాధి నుంచి కాపాడిన అమ్మవారికి ఉగాది రోజు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్థులు తెలిపారు.