ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో గురువారం మున్సిపల్ తాజా మాజీ ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పదవితో పనిలేదని అన్నారు. పదవీకాలం ముగిసిన సరే ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.