MBNR: పాలమూరు యూనివర్సిటీలో మార్చి 17, 18 తేదీలలో నిర్వహించిన SFI రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్లో పాలమూరు యూనివర్సిటీకి చెందిన బత్తిని రాము రాష్ట్ర యూనివర్సిటీల కో-కన్వీనర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బత్తిని రామును యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు అభినందించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.