MHBD: భార్యపై ఓ భర్త గొడ్డలితో దాడి చేసిన ఘటన గురువారం కంబాలపల్లిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన విజయ, నరేష్‌లు భార్యభర్తలు కాగా కుటుంబకలహాల నేపథ్యంలో నరేష్ విజయపై గొడ్డలితో దాడిచేశాడు. ఈ ఘటనలో విజయకు తీవ్రగాయాలు కాగా స్థానికులు 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విజయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.