»Sexual Assault On Dalit Girl In Uttar Pradesh Video Taken And Blackmailed
Blackmailed: దళిత యువతిపై లైంగికదాడి.. వీడియో తీసి బ్లాక్ మెయిల్
దళత మహిళకు మత్తు మందు ఇచ్చి బలవంతంగా బీఫ్ తినిపించారు. సృహతప్పి పడిపోయిన యువతిపై ఇద్దరు ముస్లిం అబ్బాయిలు అఘాయిత్యానికి తెగబడ్డారు. అంతే కాకుండా అశ్లీలంగా చిత్రీకరించారు.
Sexual assault on Dalit girl in Uttar Pradesh.. Video taken and blackmailed
Blackmailed: చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా ఇంకా దళిత మహిళలపై లైంగిక దాడులు(Sexual assault) జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో(Uttar Pradesh)ని ఓ ప్రాంతంలో ఇద్దరు ముస్లిం యువకులు ఓ దళిత యువతి పట్ల క్రూరంగా ప్రవర్తించారు. మత్తు మందు ఇచ్చి బలవంతంగా బీఫ్ తినిపించి, సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా దాన్నంత మొబైల్(mobile)లో చిత్రీకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తరప్రదేశ్ బరేలి(Bareilly) జిల్లాకు చెందిన ఓ దళిత యువతి తన స్నేహితురాలైన ముస్లిం మహిళ వద్ద నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. ఆ డబ్బు తిరిగి చెల్లించాలని ముస్లిం మహిళ దళిత యువతిని అడిగింది. ఇంకొంచెం సమయం ఇవ్వాలని కోరగా దానికి మస్లిం మహిళ వత్తిడి చేసింది. కలిసి సమాధానం చెప్పమని సదరు బాధితురాలును సెప్టెంబర్ 2వ ఓ ప్రాంతానికి పిలిచింది. దాంతో తాను పిలిచిన ఓ హోటల్‌కు వెళ్లింది. అక్కడ ముస్లిం మహిళతో పాటు మరో ఇద్దరు యువకులు ఉన్నారు. బాధిత యువతికి మత్తు మందు ఇచ్చి బలవంతంగా బీఫ్ తినిపించారు. స్పృహ కోల్పోయిన ఆమెపై ఇద్దరు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమెను నగ్నంగా చిత్రీకరించారు. ఆ వీడియోలను అడ్డుగా పెట్టుకుని రూ. 5 లక్షలు డిమాండ్ చేశారు. ఆ వీడియోను తనకు కాబోయే భర్తకు పంపించారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నందితులుగా ఉన్న ఇద్దరు ముస్లిం యువకులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరు బీ ఫార్మసీ స్టూడెంట్ సోహెబ్, మరోకరు బార్బర్‌గా పనిచేస్తున్న నజీంగా గుర్తించారు.