G20 సమావేశానికి ముందు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని అమెరికా(America) ఉత్పత్తులపై విధిస్తున్న అదనపు సుంకం (ఎక్సైజ్ డ్యూటీ)ని ఎత్తివేయాలని నిర్ణయించింది. వీటిలో శనగలు, ఉలవలు, యాపిళ్లు, వాల్నట్స్, బాదం ఉన్నాయి. భారత్ ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై యూఎస్ (US) టారిఫ్ లను పెంచడంతో.. గతంలో పలు అమెరికా ఉత్పత్తులపై భారత్ అదనపు సుంకాలను పెంచింది. తాజాగా కొన్నింటికి సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.ప్రధాని మోడీ (PMMODI) జూన్‌లో అమెరికా పర్యటనకు వెళ్లొచ్చారు.
ఆ మరుసటి నెలలోనే (జులైలో) అమెరికాకు చెందిన 7 ఉత్పత్తులపై ఎక్స్ ట్రా ట్యాక్స్(Tax)ను ఎత్తేసే అంశంపై రాజ్యసభలో కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ ప్రకటన చేశారు. ఈ నిర్ణయం వల్ల భారత్(India)కు ఎలాంటి నష్టం ఉండదని ఆనాడు స్పష్టం చేశారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ (Biden) ఢిల్లీకి వస్తున్న నేపథ్యంలో దీనిపై భారత ప్రభుత్వం మరోసారి అధికారిక ప్రకటన చేసింది.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇవాళ అర్ధరాత్రి భారత్‌కు చేరుకోనున్నారు. ప్రస్తుతం ఇండోనేషియా పర్యటనలో ఉన్న ప్రధాని తిరిగి రాగానే బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నరు.చర్చలు అనంతరం ఇద్దరు నేతలు రాజ్‌ఘాట్(Rajghat)కు వెళ్లనున్నారు.