»Delhi Police Filed Complaint Against Dmk Leader A Raja For His Remarks On Sanatana Dharma
Sanatana Dharma: సనాతన ధర్మం హెచ్‌ఐవీలాంటిది.. డీఎంకే ఎంపీ ఏ రాజాపై ఢిల్లీ పోలీస్‌లో ఫిర్యాదు
ఎ రాజాపై ఢిల్లీ పోలీసులకు సామాజిక కార్యకర్త, న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మాన్ని అవమానించారని, మత ప్రాతిపదికన సమాజాన్ని విభజించారని, మత మనోభావాలను దెబ్బతీస్తున్నారని తన ఫిర్యాదులో ఆరోపించారు.
Sanatana Dharma: డీఎంకే ఎంపీ ఏ రాజా సనాతన్ ధర్మాన్ని హెచ్ఐవీ, కుష్టు వ్యాధితో పోల్చారు. దీంతో తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఎంపీ ఏ రాజాపై ఫిర్యాదు నమోదైంది. గురువారం (సెప్టెంబర్ 7) ఎ రాజాపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక కార్యకర్త, న్యాయవాది వినీత్ జిందాల్ ఈ ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మాన్ని అవమానించారని, మత ప్రాతిపదికన సమాజాన్ని విభజించారని, మత మనోభావాలను దెబ్బతీస్తున్నారని తన ఫిర్యాదులో ఆరోపించారు.
డీఎంకే ఎంపీ ఏ రాజా ఏం చెప్పారు?
సనాతన ధర్మం ఒక సామాజిక వ్యాధి అని.. సనాతనాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చడంలో ఉదయనిధి వినయం ప్రదర్శించారని.. హెచ్ఐవీ, లెప్రసీ తరహా వ్యాధులతో పోల్చి చూడాలని.. ఈ వ్యాధుల కంటే దారుణం.. ప్రాణాంతకం’’ అని కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఇటీవల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతో పోల్చి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. “సనాతన ధర్మం ప్రజలను మతం, కులాల ప్రాతిపదికన విభజిస్తుంది, సనాతన ధర్మాన్ని రద్దు చేయడం మానవత్వం. సమానత్వాన్ని కాపాడుకోవడమే” అని ఆయన అన్నారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్య తర్వాత బీజేపీ సహా పలు పార్టీలు ఆయనపై విమర్శలు గుప్పించాయి. డిఎంకె మిత్రపక్షం కాంగ్రెస్ ఉదయనిధి స్టాలిన్ ప్రకటనకు దూరంగా ఉంది.