ELR: బుట్టాయగూడెం మండలంలోని కొవ్వాడ ఇండియన్ గ్యాస్ గోదామును తహశీల్దార్ ఎస్. రాధాకృష్ణ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యాస్ నిల్వలను, సంబంధిత రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. వినియోగదారులకు ఎటువంటి అంతరాయం కలగకుండా గ్యాస్ సిలిండర్లను సక్రమంగా సరఫరా చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో తహశీల్దార్, జీసీసీ అకౌంటెంట్ చంటిబాబు పాల్గొన్నారు.