BHNG: మోత్కూర్లో ఉగాది సందర్భంగా గ్రామ దేవతలకు పట్టు వస్త్రాల అలంకరణ కార్యక్రమం నిర్వహించారు. ఛైర్పర్సన్ గడ్డం సప్న, వైస్ ఛైర్మన్ పల్లెర్ల వెంకన్న ఆధ్వర్యంలో బొడ్రాయి వద్ద డప్పు చప్పులతో సమర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సతీష్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఉగాది పండుగను స్థానికులు ఘనంగా జరుపుకున్నారు.