అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సెన్సెక్స్ ఏకంగా 1600 పాయింట్లకు పైగా కుప్పకూలింది. అదేవిధంగా నిఫ్టీ కూడా 500 పాయింట్ల మేర పతనమైంది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ట్రేడవుతుండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది.