»Ramya Aka Divya Spandana Death Is Fake Actress Is Alive
Divya Spandana: స్టార్ హీరోయిన్ మృతి.. నేను చనిపోలేదు రేపొస్తున్న అంటున్న దివ్య స్పందన
ఓ జర్నలిస్ట్ దివ్య స్పందన బతికే ఉందని ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉందని కూడా చెప్పారు. తన వాదనను బలపరిచేందుకు జర్నలిస్ట్, దివ్య స్పందన అలియాస్ రమ్యతో తను సమావేశం అయిన ఫోటోను కూడా పంచుకున్నారు.
Divya Spandana: కన్నడ నటి, కాంగ్రెస్ నాయకురాలు దివ్య స్పందన అలియాస్ రమ్య గుండెపోటుతో చనిపోయిందని సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. ఆమె అభిమానులు సోషల్ మీడియాలో తన మరణానికి RIP అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు నటి మరణ వార్త ఫేక్ అని తేలింది. ఓ జర్నలిస్ట్ దివ్య స్పందన బతికే ఉందని ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉందని కూడా చెప్పారు. తన వాదనను బలపరిచేందుకు జర్నలిస్ట్, దివ్య స్పందన అలియాస్ రమ్యతో తను సమావేశం అయిన ఫోటోను కూడా పంచుకున్నారు.
దివ్య స్పందన మరణ వార్త తర్వాత, జర్నలిస్ట్ ట్వీట్ చేశారు. తాను బతికే ఉంది. జర్నలిస్ట్ తన ట్వీట్లో, ‘నేను దివ్య స్పందనతో మాట్లాడాను. తాను బాగానే ఉన్నారు. ఆమె రేపు బెంగుళూరుకు తిరిగి వస్తుంది.” అని పేర్కొన్నారు.
I just spoke to @divyaspandana She’s well. En route to Prague tomorrow and the to Bangalore.
దివ్య స్పందన మరణ వార్త ఫేక్ అని ట్వీట్ చేయడానికి ముందు, జర్నలిస్ట్ నటి మరియు కాంగ్రెస్ నాయకుడిని కలిసిన చిత్రాన్ని కూడా పోస్ట్ చేశాడు. ఈ చిత్రంతో తాను క్యాప్షన్‌లో “జెనీవాలో డిన్నర్ కోసం ప్రతిభావంతులైన మహిళను కలవడం చాలా అద్భుతంగా ఉంది. బెంగుళూరుపై మాకున్న ప్రేమతో పాటు చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం.’ అని రాసుకొచ్చారు.
Wonderful meeting the very talented and genteel lady @divyaspandana for dinner in Geneva. We talked about many things including our love for Bangalore. 💫 pic.twitter.com/1kN5ybEHcD
దివ్య స్పందన కెరీర్
నవంబర్ 29, 1982లో జన్మించిన దివ్య స్పందనను తెరపై రమ్య అని పిలుస్తారు. ఆమె ప్రతిభావంతులైన ఫేమస్ హీరోయిన్ మాత్రమే కాకుండా ప్రముఖ రాజకీయ నాయకురాలు. కర్ణాటకలోని మాండ్యాకు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభలో పార్లమెంటు సభ్యురాలిగా ప్రతిష్టాత్మకమైన పదవిని నిర్వహించారు. రమ్య కెరీర్లో ప్రధానంగా కన్నడ సినిమాల్లో నటించింది. దాంతో పాటు తమిళ చిత్రాల్లో కూడా నటించింది. అంతే కాకుండా ఆమె సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డు, ఉదయ అవార్డు, కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారం సాధించింది.