ఢిల్లీ వేదికగా జరిగే జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల అధినేతలు (leaders) హాజరు కానున్నారు.వారిని ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ ఆధారిత ‘అవతార్ (AI-generated avatar)’ ఆహ్వానించనుంది. ఎగ్జిబిషన్ ప్రాముఖ్యత గురించి అతిథులకు ఈ అవతార్ క్లుప్తంగా వివరించనుందని అధికారిక వర్గాలు వెల్లడించారు.అతిథుల (Guests) కోసం ఇప్పటికే దిల్లీలోని ప్రముఖ హోటళ్లను బుక్ చేశారు. సదస్సుకు వచ్చే ప్రతినిధులకు భారత అతిథ్యాన్ని పరిచయం చేసే పనిలో హోటళ్లు నిమగ్నమయ్యాయి. ప్రతినిధులను స్వాగతం పలకడం దగ్గర నుంచి వారికి బస, వంటకాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.హోటళ్లను వివిధ రకాల పూలతో అందంగా అలంకరిస్తున్నాయి.
అతిథులకు విదేశీ వంటకాలతో పాటు భారత రుచులను పరిచయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజ్ హోటల్ (Taj Hotel) నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ దేశాధినేతలు బస చేసే గదులను పోలీసులు(Police) భద్రతా సిబ్బంది ఇప్పటికే తనిఖీ చేశారనీ చెప్పారు. జీ20 అతిథులకు అంతర్జాతీయ వంటకాలతో సహా 250కి పైగా రుచికరమైన వంటకాలను అందించాలని లలిత్ హోటల్ ప్రణాళిక చేస్తోంది. ‘శ్రీ అన్న’ పథకాన్ని దృష్టిలో ఉంచుకుని, తృణధాన్యాల ఆధారిత వంటకాలను కూడా చేయనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను హోటల్ నిర్వాహకులు పరిశీలిస్తున్నారు.వాస్తవంగా ఈ హరప్పా (Harappa) బాలిక శిల్పం ఎత్తు 10.5 సెంటీమీటర్లు కాగా.. ఈ ఎగ్జిబిషన్(Exhibition)లో 5 అడుగుల ఎత్తు, 120 కిలోల బరువున్న శిల్పాన్ని ప్రదర్శించనున్నారు.
ఇది పోడియంపై గుండ్రంగా తిరుగుతూ కన్పిస్తుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.దీంతో పాటు దేశ ఎన్నికల చరిత్రను కూడా ఇక్కడ ప్రదర్శించనున్నారు. 1951-52లో తొలి సార్వత్రిక ఎన్నికలు (General Elections) జరిగినప్పటి నుంచి 2019 లోక్సభ ఎన్నికల వరకు ఎన్నికల విధానాల్లో వచ్చిన మార్పులను ఈ ఎగ్జిబిషన్లో చూపించనున్నారు.సమావేశం దృష్ట్యా భద్రతా పరమైన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. సదస్సు పరిసర ప్రాంతాల్లో డ్రోన్లతో అణువణువూ జల్లెడ (G20 summit 2023 delhi security) పడుతున్నారు. హెలికాప్టర్ ఆధారిత డ్ర్రిల్స్ నిర్వహిస్తున్నారు. ప్రపంచ దేశాధినేతలు సదస్సుకు రానుండటంతో దిల్లీ(Delhi)లో సెప్టెంబర్ 8నుంచి 10 వరకు అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలకు కేజ్రీవాల్ ప్రభుత్వం మూడు రోజులు సెలవులు ప్రకటించింది.