»Indrakiladri Navratri Celebrations From October 15
Indrakeeladri: ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి..అక్టోబర్ 15 నుంచి నవరాత్రి ఉత్సవాలు
దసరా శరన్నవరాత్రి వేడుకలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. అక్టోబర్ 15వ తేది నుంచి 23వ తేది వరకూ ఈ నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయ అధికారులు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతి రోజూ రాత్రి 10 గంటల వరకు దుర్గమ్మను వివిధ రూపాలలో దర్శించుకోవచ్చు. మొదటి రోజు మినహా మిగిలిన రోజుల్లో తెల్లవారు జామున 4 గంటల నుండే దర్శనాలు మొదలవుతాయి. భక్తుల రద్దీ దృష్ట్యా మూలా నక్షత్రం రోజు అంటే 20వ తేదీ తెల్లవారు జామున 2 గంటల రాత్రి 11 గంటల వరకు అమ్మవారు భక్తులకు కనిపించనుంది.
23వ తేదీ విజయదశమి రోజు 10:30 గంటలకు పూర్ణాహుతితో దేవి నవరాత్రులను ఆలయ అధికారులు, అర్చకులు ముగిస్తారు. సాయంత్రం దుర్గ మలేశ్వర స్వామి వార్లు హంస వాహనంపై కృష్ణా నదిలో తెప్పపై నదీ విహారం చేస్తారు. ఆలయ పరిసరాల్లో క్యూ లైన్స్, ఘాట్ స్నానాలు వద్ద ఏర్పాట్లపై అధికారులు ఫోకస్ పెట్టారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.