»800 Movie Sachin Tendulkar To Be Chief Guest For Trailer Event
800 Movie: ఆ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి సచిన్ టెండూల్కర్..!
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అంటే తెలియనివారంటూ ఉండరు. ఆయన మైదానంలో క్రికెట్ ఆడటం అందరికీ తెలుసు. క్రికెట్ సంబంధిత ఈవెంట్స్‌లో కూడా ఆయన పాల్గొంటూ ఉంటారు. అయితే ఓ మూవీ ట్రైలర్ ఈవెంట్‌కి సచిన్ రావడం ఎప్పుడైనరా విన్నారా? నిజంగానే ఆయన వస్తున్నారు.
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) బయోపిక్ ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘800’. అక్టోబర్ నెలలో తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో గ్రాండ్ థియేటర్లలో విడుదల కానుంది. సెప్టెంబర్ 5న ముంబయిలో జరగనున్న స్టార్-స్టడెడ్ ఈవెంట్లో దీని ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. క్రికెటర్లు, సినీ తారలు హాజరయ్యే బిగ్-టికెట్ ఈవెంట్‌కు గ్రేటెస్ట్ ఇండియన్ క్రికెటర్ మురళీధరన్ సమకాలీనుడు సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
శ్రీదేవి మూవీస్‌కి చెందిన సీనియర్ టాలీవుడ్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ప్రమోషన్స్‌ను స్టైల్‌గా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి సచిన్ హాజరుకావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ‘ఆదిత్య 369’తో పాటు ఇతర హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ ప్రసాద్ తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమా విడుదల హక్కులను సొంతం చేసుకున్నారు.
ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించిన ‘800’కి గిబ్రాన్ సంగీతం అందించారు. మురళీధరన్‌గా మధుర్ మిట్టల్ నటిస్తున్నాడు. ఆయన సమకాలీనులు మురళీ అని పిలుచుకుంటారు. మహిమా నంబియార్ తెరపై భార్యగా కనిపించనుంది. నరేన్, నాజర్, వేల రామమూర్తి, రిత్విక, వడివుక్కరాసి, అరుల్ దాస్ తదితరులు కూడా ఈ చిత్రంలో నటించారు. ‘800’ మూవీ కోట్లాది మంది క్రికెట్ అభిమానులను టార్గెట్ చేసింది. అనేక సంవత్సరాల పాటు తన కెరీర్లో 800 టెస్ట్ వికెట్లు, 530 కంటే ఎక్కువ ODI వికెట్లు తీసిన ఏకైక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ మాత్రమే. ఆయన బయోపిక్‌తో సినిమా రూపొందుతుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.