గంజాయి, మద్యం కోసం గొర్రెలను దొంగిలించారనే ఆరోపణతో ఇద్దరు వ్యక్తులను కాళ్లకు తాడు కట్టి జంతువుల మాదిరిగా తలకిందులుగా వేలాడదీసి, కింద నుంచి నిప్పు పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఇందులో ఓ వ్యక్తి దళితుడని చెబుతున్నారు.
Stealing Sheep: తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఓ అమానవీయ ఉదంతం వెలుగు చూసింది. గంజాయి, మద్యం కోసం గొర్రెలను దొంగిలించారనే ఆరోపణతో ఇద్దరు వ్యక్తులను కాళ్లకు తాడు కట్టి జంతువుల మాదిరిగా తలకిందులుగా వేలాడదీసి, కింద నుంచి నిప్పు పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఇందులో ఓ వ్యక్తి దళితుడని చెబుతున్నారు. మందమర్రి ప్రాంతంలో కొంత మంది నిరుద్యోగ యువకులు మద్యానికి, గంజాయికి బానిసలుగా మారారు.. మత్తులో పడి డబ్బులు కోసం చుట్టుపక్కలకు చెందిన ప్రజల ఇళ్లలో చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. అంతే కాకుండా ప్రజలు పెంచుకునే కోళ్లను దొంగిలించి తింటారు.
గ్రామస్తుల కథనం ప్రకారం నిందితులిద్దరూ అదే గ్రామానికి చెందిన వ్యక్తి గొర్రెను దొంగిలించారని.. దానిని ఏమి చేశారో.. చంపాడో, అమ్మాడో తెలియదని, దాంతె పాటు ఇంట్లో పైపును దొంగిలించారని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో ప్రజలు కోపోద్రిక్తులైన తేజ (19), కిరణ్ (30) అనే దళితుడిని పట్టుకుని మొదట కొట్టి, కాళ్లను తాడుతో కట్టి, తలకిందులుగా వేలాడదీసి, కింది నుంచి నిప్పు పెట్టారు.
అయితే ప్రతిరోజు జరుగుతున్న చిన్నచిన్న దొంగతనాలతో విసిగిపోయామని గ్రామస్తులు చెబుతున్నారు. కిరణ్ కూడా దొంగతనానికి అంగీకరించాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పుడు కాలికి తాడు కట్టి, కింద నుంచి పొగ ఇస్తూ తలకిందులుగా వేలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా పోలీసులు గుర్తించి చర్యలు తీసుకున్నారా అనేది ఇంకా తెలియరాలేదు.