»Sonia Gandhi Admitted To The Delhi Gangaram Hospital Again September 2nd 2023
Sonia Gandhi: మళ్లీ ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ..ప్రమాదామా?
కాంగ్రెస్ పార్టీ కీలక నేత సోనియా గాంధీ(Sonia Gandhi) మళ్లీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో శనివారం సాయంత్రం అడ్మిట్ అయ్యారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో శనివారం సాయంత్రం తీసుకెళ్లారు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఆమెకు ఛాతీలో ఇన్ ఫెక్షన్ కారణంగా తేలికపాటి జ్వరం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసింది. ఈ క్రమంలో సోనియాగాంధీ ఆరోగ్యంపై గంగారాం ఆసుపత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. సోనియా గాంధీకి చాలా కాలంగా ఈ సమస్య ఉందని ఆసుపత్రి తన ప్రకటనలో పేర్కొంది. ఆమె సాధారణ చెకప్ కోసం అడ్మిట్ అయ్యారని వెల్లడించారు. సోనియా గాంధీ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరడం ఇదే మొదటిసారి కాదని తెలిపారు.
అయితే ఈ ఏడాది ప్రారంభంలో మార్చి 3న కూడా సోనియా గాంధీ జ్వరం కారణంగా గంగారామ్ ఆసుపత్రి(gangaram hospital)లో చేరారు. ఆ సమయంలో చెస్ట్ మెడిసిన్ డాక్టర్ అరూప్ బసు, అతని బృందం సోనియా గాంధీకి చికిత్స అందించారు. ఆ సమయంలో ఆమె కొన్ని విచారణలు ఎదుర్కొన్నారు. అంతకు ముందు వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం ఆమె జనవరి 12, 2023న ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. జనవరి 17, 2023న ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.