కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తాను మటన్ కర్రీ(Mutton Curry) వండిన వంటకం వీడియోను సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా తాజాగా షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది. ఇది చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) శనివారం సాయంత్రం ట్విట్టర్లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఢిల్లీలో ఉంటున్న ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి ఇంటికి రాహుల్ వెళ్లారు. ఆ క్రమంలో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, అతని కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ నేపథ్యంలోనే లాలూ ప్రసాద్ సమక్షంలో తాను వంట(cooking) నేర్చుకున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. ఆ తర్వాత మటన్ కర్రీ(Mutton Curry) వండిన ప్రత్యేక విందు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలో మటన్ ఎలా ఉడికించాలో రాహుల్ గాంధీకి లాలూ పలు సూచనలు చేశారు. మటన్ కలపడం, మసాలా కలపడం వంటి విషయాలను ప్రస్తావించారు. అంతేకాదు నేను వంట చేయగలను. కానీ నేను నిపుణుడిని కాదు. యూరప్‌లో ఒంటరిగా ఉంటూనే వంట నేర్చుకోవాల్సి వచ్చిందని రాహుల్ అన్నారు. చిన్నచిన్న వంటలు వండుకోవచ్చన్నారు. కానీ లాలూ గారు అద్భుతంగా వండుతారని రాహుల్ గాంధీ రాసుకొచ్చారు.
ఇక లాలా ప్రసాద్ యాదవ్(lalu prasad yadav) తాను ఏడో తరగతి చదువుతున్నప్పుడే వంట నేర్చుకున్నానని తెలిపారు. తాను తన సోదరులను కలవడానికి పాట్నా వెళ్లిన క్రమంలో తనను అక్కడికి పిలిచారని చెప్పారు. అక్కడ తాను వారికి వంట చేసేవాడినని అన్నారు. అంతేకాదు చెరకు సేకరించడం, గింజలు రుబ్బడం, మసాలాలు రుబ్బడం అన్నీ అక్కడే నేర్చుకున్నానని లాలూ ప్రసాద్ యాదవ్ పాత రోజులను జ్ఞాపకం చేసుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలువురు మెచ్చుకుంటుండగా మరికొంత మంది మాత్రం అవినీతి చేసిన వ్యక్తితో జతకట్టారని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష కూటమి అయిన ఇండియాకు ఆర్జేడీ మద్దతుగా నిలుస్తుంది.
लोकप्रिय नेता, लालू जी से उनकी सीक्रेट रेसिपी और ‘राजनीतिक मसाले’ पर दिलचस्प बातचीत हुई।
ग़रीबों, वंचितों, अल्पसंख्यकों और महिलाओं के लिए INDIA की सोच एक है – समानता, प्रगति और सशक्तिकरण।