»21 Years Young Man Jaskaran Singh Won Crore By Saying A Single Answer In Kbc 15th Season
Jaskaran Singh: ఒకే అన్సార్ చెప్పి కోటి గెల్చుకున్న యువకుడు
ఓ యువకుడు ఒకే ప్రశ్నకు సమాధానం చెప్పి ఏకంగా కోటి రూపాయలు గెల్చుకున్నాడు. అదెంటీ అనుకుంటున్నారా? అవును మీరు చదవింది నిజమే. 21 ఏళ్ల పంజాబ్ కు చెందిన కుర్రాడు..కౌన్ బనేగా కరోడ్‌పతి(KBC) ప్రస్తుతం 15వ సీజన్లో అమితాబ్(amitabh bachchan) అడిగిన ఓ ప్రశ్నకు జవాబు చెప్పి ఆ మనీ గెల్చుకున్నాడు. అంతేకాదు సెప్టెంబర్ 4న 7 కోట్ల రూపాయల ప్రశ్నను కూడా ఎదుర్కొబోతున్నాడు.
21 years young man Jaskaran Singh won crore by saying a single Answer in kbc 15th season
ఓ 21 ఏళ్ల కుర్రాడు పేదరికంలో పుట్టాడు. కానీ ఒకే ప్రశ్నకు జవాబు చెప్పి ప్రస్తుతం కోటిశ్వరుడిగా మారాడు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం. పంజాబ్‌లోని ఖల్రా గ్రామానికి చెందిన జస్కరన్ సింగ్ అనే 21 ఏళ్ల కుర్రాడు ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రస్తుతం 15వ సీజన్లో పాల్గొన్నాడు. ఎప్పటిలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్(amitabh bachchan) హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ క్రమంలో జరిగిన క్విజ్‌లో భాగంగా పంజాబ్‌కు చెందిన జస్కరన్ సింగ్ ఓ ప్రశ్నకు జవాబు చెప్పి కోటి రూపాయలు గెల్చుకున్నాడు. అతని తండ్రి చరణ్‌జిత్ సింగ్ వారి గ్రామంలో క్యాటరర్‌గా పనిచేస్తున్నాడు. తల్లి కుల్విందర్ కౌర్ ఇంటిని చూసుకుంటుంది. జస్కరన్కు ఒక సోదరి, ఒక తమ్ముడు ఉన్నారు. కుటుంబం మొత్తం తండ్రి శ్రమపైనే ఆధారపడుతుంది.
అయితే యువకుడు జస్కరన్ సింగ్(Jaskaran Singh) కాలేజీ గ్రాడ్యుయేట్ కాగా.. అతను ప్రస్తుతం UPSC ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 4న ప్రసారం కానున్న తదుపరి ఎపిసోడ్లో రూ.7 కోట్ల ప్రశ్నను కూడా ఎదుర్కొబోతున్నాడు. మరి గెల్చుకుంటాడో లేదో వేచి చూడాలి. ఈ జాక్‌పాట్ ప్రశ్న నేపథ్యంలో జస్కరన్ వస్తుందా లేదా ఏమి జరుగుతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్‌కు ముందు రాహుల్ కుమార్ నేమా అనే వ్యక్తి రూ. 1 కోటి ప్రశ్నను చేరుకున్న మొదటి పోటీదారు అయ్యాడు. అయితే అతను రిస్క్ తీసుకోకుండా రూ.50 లక్షలతో నిష్క్రమించాడు.
కౌన్ బనేగా కరోడ్‌పతి ‘హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్?’ అనే పేరుతో బ్రిటీష్ టీవీ ప్రోగ్రాం ఆధారంగా ఒక గేమ్ షోను నిర్వహిస్తున్నారు. బిగ్ బి గత 14 సీజన్ల లోను దినితో అనుబంధం కలిగి ఉన్నాడు. షారూఖ్ ఖాన్ KBC సీజన్ 3కి హోస్ట్‌గా వ్యవహరించారు. KBC ఇండియాలో మొదటిసారిగా 2000లో ప్రసారం చేయబడింది. ఈ కార్యక్రమం సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు సోనీ టీవీలో ప్రసారం అవుతుంది.