»Ap Cm Jagan With Bharathi London Tour Again To The State After A Week
AP CM Jagan: లండన్ టూర్..మళ్లీ వారం తర్వాతే రాష్ట్రానికి
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తన భార్య భారతితో కలిసి లండన్ టూర్ వెళ్లారు. సెప్టెంబర్ 2న రాత్రి విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో లండన్(London) చేరుకున్నారు.
AP CM Jagan with bharathi London tour again to the state after a week
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy)తన సతీమణి భారతి(bharathi)తో కలిసి లండన్(London) బయల్దేరారు. శనివారం రాత్రి 9.30 గంటలకు జగన్ దంపతులు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో లండన్ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు తదితరులు సీఎం జగన్‌కు మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్‌తో కలిసి వీడ్కోలు పలికారు. అయితే జగన్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్లారు. అక్కడే ఉంటున్న తమ పిల్లలు హర్షారెడ్డి, వర్షా రెడ్డిలతో సీఎం దంపతులు గడపనున్నారు. సెప్టెంబర్ 11న సీఎం జగన్ తిరిగి మళ్లీ రాష్ట్రానికి రానున్నారు.
ఈ క్రమంలో జగన్ లండన్ వెళ్లేందుకు గతంలో సీబీఐ కోర్టు(CBI Court) నుంచి అనుమతి పొందారు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీబీ సీఐడీ కోర్టు అనుమతించింది. విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు కూడా సుముఖత వ్యక్తం చేసింది. జగన్ పెద్ద కుమార్త వైఎస్ హర్ష రెడ్డికి తన చదువు పరంగా మంచి రికార్డు ఉంది. 2017లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చేరింది. ఎకనామిక్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తర్వాత ఆమె అమెరికాలో ఫైనాన్షియల్ కన్సల్టెంట్లో ఉద్యోగానికి ఎంపికైంది.
ఆమె ప్రపంచంలోని టాప్ 5 బిజినెస్ స్కూల్స్‌లో ఒకటిగా పేరుగాంచిన INSEAD బిజినెస్ స్కూల్ నుంచి ఫైనాన్స్‌లో M.Sc పూర్తి చేసింది. డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించిన హర్ష రెడ్డికి డీన్ల జాబితాలో అవకాశం దక్కించుకుంది. హర్షారెడ్డి స్నాతకోత్సవం సందర్భంగా గత ఏడాది జూలై 2న జగన్ దంపతులు ప్యారిస్ వెళ్లారు. తన కుమార్తె గ్రాడ్యుయేషన్‌ను పురస్కరించుకుని జగన్ ట్విట్టర్ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలపడం అందరికీ తెలిసిందే.