NLR: కలిగిరి మండలం టీఎంపాలెంలోని అంగన్వాడీ కేంద్రంలో ఇవాళ ముందస్తు ఉగాది వేడుకలు నిర్వహించారు. పిల్లలతో కలిసి అంగన్వాడీ టీచర్ ఉమా మహేశ్వరి సంబరాలు చేశారు. ఉగాది రోజున సెలవుదినం కావడంతో ముందు రోజు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పండగ నిర్వహించారు. చిన్నపిల్లలతో కలిసి ఇటువంటి కార్యక్రమాలు చేయడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.