పార్వతీపురంలోని బ్రాంచ్ హైస్కూల్‌ను ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర సందర్శించి విద్యాబోధన, మౌలిక వసతులను పరిశీలించారు. ఆనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారి అభ్యాస స్థాయిని తెలుసుకున్నారు. వారికి స్వయంగా భోజనం వడ్డించి, ఉపాధ్యాయుల పనితీరును అభినందించారు. అలాగే, పాఠశాలలో ఉన్న చిన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.