»Namrata Shirodkar Reacts To Post Saying Her Son Gautam Spends Quality Time Post School With Kids In Hospital
Namrata Shirodkar: మహేష్ తనయుడి మంచి మనసు.. నెట్టింట ప్రశంసల వర్షం..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలతో ఎంత ఫేమసో, తన మంచితనం, మంచి మనసు ఆయన చేసే గొప్ప పనులతో మరింత ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. ఏ హీరో ఫ్యాన్ అయినా, మహేష్ కి అభిమాని కావాల్సిందే. మహేష్ కి ఇద్దరు ముత్యాల్లాంటి పిల్లలు ఉన్నారు.
మహేష్ బాబు కొడుకు గౌతమ్ సోషల్ మీడియాలో కనిపంచేది చాలా తక్కువ. కానీ, కూతురు సితార మాత్రం బాగా సందడి చేస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచే ప్రకటనల్లో నటించి ఆదాయం సంపాదిస్తోంది. అయితే , గౌతమ్ మాత్రం సడెన్ గా వార్తల్లోకి ఎక్కాడు. మంచి తనంలో తన తండ్రిని ఇప్పటి నుంచే మించేస్తున్నాడు. తండ్రి ఆశయాలను ఈ వయసు నుంచే అమలు చేయడం మొదలుపెట్టాడు.
మహేష్ చాలా కాలంగా, ఎంబీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో వేల మంది చిన్నారులకు గుండె సంబంధిత వైద్యం అందిస్తున్నారు. ఆంధ్ర హాస్పిటల్స్, రెయిన్ బో హాస్పిటల్స్ భాగస్వామ్యంతో ఎంబీ ఫౌండేషన్ పని చేస్తుంటుంది. ఎంబీ ఫౌండేషన్ బాధ్యతలన్నీ కూడా నమత్ర దగ్గరుండి చూసుకుంటుంది. అయితే ఈ పనులను ఈ సారి గౌతమ్ ఘట్టమనేని పర్యవేక్షించినట్టుగా కనిపిస్తోంది.
గౌతమ్ ఎంబీ ఫౌండేషన్ ద్వారా చేసే కార్యక్రమాలు, అక్కడ ఉన్న చిన్న పిల్లలను కలిసి ముచ్చటించాడు. ఇలా తన కొడుకు ముందుండి నడవడం, అందరినీ పలకరించడం, అందరితో ప్రేమగా మాట్లాడటం చూసి నమ్రత గర్వ పడుతోంది. నా కొడుకుని చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉందంటూ నమ్రత ఎమోషనల్ అయింది. ఇంకేముంది గౌతమ్ గొప్పతనం చూసి అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.