»Women Dont Wear Clothes For Those 5 Days Where Is The Strange Custom
Himachalpradesh: ఆ 5 రోజులు మహిళలు దుస్తులు ధరించరు.. వింత ఆచారం ఎక్కడుందంటే!
భారతదేశం (India)లో విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉంటాయని అందరికీ తెలుసు. ప్రజలు తమ తమ విశ్వాసాలను, ఆచారాలను పాటిస్తూ ఉంటారు. అయితే టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ చాలా ఆచారాలు కనుమరుగైపోయాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
ఇండియాలో టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ మూఢ విశ్వాసాలను పాటించే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ కొన్ని వింత సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మహిళలను ఆ సాంప్రదాయాలు ప్రత్యేక పరిస్థితులలోకి నెట్టేలా చేస్తున్నాయి. అలాంటి ప్రాంతమే హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లోని కులు జిల్లాలోని పిని గ్రామం.
వర్షాకాలంలో ఇక్కడ ప్రత్యేక పండగ జరుగుతుంది. ఆ పండగలో ప్రజలు ప్రత్యేక ఆచారాలు (Rituals), నియమాలను పాటిస్తారు. పండగ జరిగే ఐదు రోజులూ స్త్రీలు బట్టల్ని అస్సలు ధరించరు. వర్షాకాలంలో జరిగే ఈ 5 రోజుల పండగలలో మహిళలు పూర్తిగా నగ్నంగానే ఉండటం విశేషం. అయితే ఆ 5 రోజుల్లో మహిళలు ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతుంటారు. గ్రామంలోని ఇతర పురుషుల ముందుకు, బయటకు రారు. ఇంట్లోనే నగ్నంగా ఉండటం అక్కడి ఆచారం.
ఆ ఊరి గ్రామ దేవత ఓ రాక్షసుడిని ఓడించిన క్షణానికి గుర్తుగా భద్రబ్ మాసం మొదటి రోజున గ్రామస్తులు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఆ రోజుల్లో దుష్టశక్తులు మహిళ గౌరవంపై దాడి చేసి వారి బట్టలు చింపివేస్తాయని గ్రామస్తులు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆ సమయంలో మహిళలు శరీరాన్ని కప్పి ఉంచుకోవడానికి ఉన్ని దుప్పట్లను వినియోగిస్తారు. అయితే కాలక్రమేణా ఆ గ్రామ యువతలో మార్పు వచ్చింది. చాలా మంది ఆ వింత ఆచారాన్ని పాటించడం మానేశారు. కానీ వృద్ధ మహిళలు మాత్రం ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. పండగ రోజుల్లో ఆ ఊరి వృద్ధ మహిళలు నగ్నంగా ఉంటూ ఊరి ఆచారాన్ని పాటిస్తున్నారు.