SRD: అమీన్పూర్ సర్కిల్లో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి కాలనీలో సిబ్బంది కేటాయించి రోజూ పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఐదు మున్సిపాలిటీలకు కేటాయించిన రూ.75 కోట్ల అభివృద్ధి పనులు వేగంగా ప్రారంభించాలని చెప్పారు. వేసవిలో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.