NRPT: ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో బుధవారం మరికల్ మండలం అప్పంపల్లి గ్రామంలో రైతులకు ఉచితంగా కూరగాయ విత్తనాలు గ్రామ సర్పంచ్ కళ్యాణి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు భరోసా అందిస్తూ విత్తనాలు పంపిణీ చేసి రైతులకు అండగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాలే దామోదర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, హార్టికల్చర్ లింగరాజు ఉన్నారు.