CTR: మూడు జిల్లాల పరిధిలో జిల్లా పరిషత్తుల ఏర్పాటు పని ప్రారంభమైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని జిల్లా పరిషత్ ఎన్నికల నాటికి అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు కొత్తగా జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేసేలా రాష్ట్రస్థాయిలో కసరత్తు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్లో జడ్పీ పదవీకాలం ముగియనుండటంతో, ఆలోపు విభజించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.