‘ధురంధర్ 2 చిత్రానికి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. 3 గంటల 49 నిమిషాల నిడివి గల ఈ సినిమాలో తల నరకడం, సుత్తితో దాడి వంటి 4 అత్యంత హింసాత్మక దృశ్యాలతో సహా మొత్తం 21 మార్పులను సూచించింది. అలాగే నోట్ల రద్దు తేదీల సవరణతో పాటు ‘లాహోర్’ అనే పదాన్ని ‘డిల్లీ’గా మార్చాలని సీబీఎఫ్సీ ఆదేశించింది. ఈ మార్పుల తర్వాతే సినిమా విడుదలకు సర్టిఫికెట్ జారీ చేసింది.