»Janashakti Leader Kura Rajanna And Vimalakka Husband Amar Arrested
Vimalakka భర్త అమర్ అరెస్ట్..? కూర రాజన్న కూడా
జనశక్తి నేత కూర రాజన్న, అతని సోదరుడు కూర దేవేందర్ అలియాస్ అమర్ సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అమర్ విమలక్క భర్త అనే సంగతి తెలిసిందే.
Janashakti Leader Kura Rajanna And Vimalakka Husband Amar Arrested
Vimalakka Husband Amar Arrest: జనశక్తి నేత కూర రాజన్న, అతని సోదరుడు కూర దేవేందర్ (అమర్) (Amar), వెంకటేశ్, మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అమర్ ప్రజా గాయని విమలక్క (Vimalakka) భర్త అనే సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని నల్గొండ జిల్లా మాడుగులపల్లి, కుక్కడం గ్రామాలకు తరలించారని సమాచారం. రాజన్న, అమర్ అరెస్ట్‌కు సంబంధించి పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఐదుగురిని పోలీసు వాహనంలో కాకుండా.. బైక్ మీద తీసుకొచ్చారని కుక్కడం- మాడుగులపల్లి గ్రామాల్లో గల బత్తాయి, మామిడి తోటల్లోకి తీసుకెళ్లారని స్థానికులు తెలిపారు. ఆమనగల్లో గద్దర్ సంస్మరణ సభలో అమర్ పాల్గొన్నారని విమలక్క (Vimalakka) పేర్కొన్నారు. కూర రాజన్న అనారోగ్యంతో బాధపడుతున్నారనే సమాచారం తెలుసుకుని పరామర్శించడానికి వెళ్లారని చెప్పారు. ఆ సమయంలో మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్ట్ చేశారని వివరించారు. కూర రాజన్నను ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో అదుపులోకి తీసుకోవడాన్ని ఖండించారు.
పాత కేసుల విచారణకు వీరు క్రమం తప్పకుండా కోర్టులకు హాజరయ్యే వారని.. విచారణకు హాజరవుతూ ఉన్నారని విమలక్క చెబుతున్నారు. పోలీసులు అనధికారికంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అరెస్ట్ చేసిన ఐదుగురిని విడుదల చేయాలని విమలక్క (Vimalakka), జనశక్తి నేతలు డిమాండ్ చేశారు.