‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్లో తన స్పీచ్పై నటుడు పార్తీబన్ క్షమాపణలు చెప్పాడు. వేదికపై కులం పేరు ప్రస్తావించడంపై స్పందిస్తూ.. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని, అది కేవలం నోరు జారడం వల్ల జరిగిందని వివరించాడు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఎన్నో సినిమాలు చేసిన తాను ఇలా చేయడం తన ఇన్నేళ్ల అనుభవంలో ఇదే మొదటిసారని, ఇకపై జాగ్రత్తగా ఉంటానని తెలిపాడు.