TPT: శ్రీకాళహస్తి పట్టణం కైలాసగిరి కాలనీ సమీపంలో గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో తనిఖీలు చేశామని టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. తమిళనాడుకు చెందిన పెరుమాళ్ వేణుగోపాల్‌ను అదుపులో తీసుకున్నారు. అతని వద్ద 2 కేజీల గంజాయి దొరికింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.