JGL: ఎండపల్లి మండలంలో 2025-26 యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి మహేశ్ తెలిపారు. కొత్తగా పట్టాదార్ పాస్‌బుక్ పొందిన రైతులు 28-02-2026 వరకు డిజిటల్ సంతకం పూర్తి చేసిన వారు, ఇంతకుముందు పాస్‌బుక్ ఉన్నప్పటికీ దరఖాస్తు చేయని రైతులు, అలాగే బ్యాంకు ఖాతా మార్చుకోవాల్సిన వారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.