ADB: ఉట్నూర్ మండలంలోని రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ సంతోష్‌ను ఐటీడీఏ ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ సభ్యులు కలిశారు. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం జీవో నెం. 3 స్థానంలో జీవో 18ను వెంటనే తీసుకురావాలని విన్నవించారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు రాజేశ్, సోమేశ్ తెలిపారు.