»No Comments On Party Cm Kcr Mynampally Hanumantha Rao
Partyని అనలే, కేసీఆర్‌ను కూడా.. హరీశ్‌పై కామెంట్స్ గురించి మైనంపల్లి
బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను తాను ఏమీ అనలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మల్కాజ్ గిరి, మెదక్ ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టారని.. హైదరాబాద్ వచ్చిన తర్వాత అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
No Comments On Party, CM KCR: Mynampally Hanumantha Rao
Mynampally Hanumantha Rao: తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumantha Rao) చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. హరీశ్‌పై నిన్న మైనంపల్లి (Mynampally) విమర్శలు చేయగా.. బీఆర్ఎస్ శ్రేణులు తప్పుపట్టాయి. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. పలు చోట్ల మైనంపల్లి (Mynampally) దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మైనంపల్లి వాడిన భాష, పదజాలాన్ని ఎమ్మెల్సీ భానుప్రసాద రావు తప్పుపట్టారు. తాము కూడా మాట్లాడగలమని.. కానీ తమకు సంస్కారం అడ్డు వస్తోందని చెప్పారు. ఎవరి చరిత్ర ఏంటో అందరికీ తెలుసని పేర్కొన్నారు. బాధ్యత గల పదవీలో ఉండి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని మరో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు అంటున్నారు. మంత్రి హరీశ్ రావుతోపాటు పార్టీకి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మెదక్ గురించి మీకెందుకు.. మీ అంతు చూస్తా అని మంత్రి హరీశ్ రావును (Harish Rao) నిన్న తిరుమలలో (Tirumala) విమర్శించారు. ఆ వ్యాఖ్యలపై ఈ రోజు స్పందించారు. తాను పార్టీని, సీఎం కేసీఆర్‌ను విమర్శించలేదని తెలిపారు. ఆ వ్యాఖ్యలు తన వ్యక్తిగతం అంటున్నారు. మెదక్, మల్కాజిగిరి ప్రజలు తనను ఆదరించారని.. బ్రహ్మారథం పట్టారని గుర్తుచేశారు. తన ప్రస్థానం మెదక్ (medak) నుంచి ప్రారంభమైందని పేర్కొన్నారు. అందుకే అక్కడి నుంచి తన కుమారుడిని బరిలో నిలబెట్టాలని అనుకున్నానని వివరించారు. తన కుమారుడికి తన అవసరం ఉందన్నారు. క్యాడర్ కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తానని తెలిపారు.
కష్టపడి పైకి వచ్చానని.. కుమారుడికి మెదక్ అసెంబ్లీ సీటు ఇస్తే.. గెలిపించుకొని వస్తానని మరోసారి స్పష్టంచేశారు. తిరుమల నుంచి కుంభకోణం వెళ్తున్నానని.. రెండురోజుల తర్వాత హైదరాబాద్ వస్తానని వివరించారు. అక్కడ అనుచరులతో సమావేశమై.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. తనను టచ్ చేస్తే మాత్రం ఊరుకోనని మరోసారి తేల్చిచెప్పారు. మైనంపల్లి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. మైనంపల్లి కామెంట్స్‌ను మంత్రి కేటీఆర్ నిన్ననే తప్పుపట్టారు. మంత్రి హరీశ్ రావు.. మొదటి నుంచి పార్టీలో ఉన్నారని.. ఆయనపై చేసిన కామెంట్స్ సరికాదని, వెనక్కి తీసుకోవాలని స్పష్టంచేశారు.