చాలా కాలం తర్వాత మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది సీనియర్ హీరోయిన్ విజయశాంతి. ఆ సినిమాలో ఆమె పాత్ర హైలెట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత మరో సినిమా చేయలేదు విజయ శాంతి. కానీ తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్.. కొరటాల శివ దర్శతక్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో అనౌన్మెంట్ వచ్చిన ఈ సినిమా సెట్స్ పైకి మాత్రం వెళ్లడం లేదు. ‘ఆచార్య’తో ఫ్లాప్ అందుకున్న కొరటాల.. ఈ సారి పాన్ ఇండియా స్థాయిలో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు భారీగా కసరత్తులు చేస్తున్నాడు.
అందుకే ఈ ప్రాజెక్ట్ కోసం తొందరపడకుండా పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగాలని చూస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పై వెళ్లేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం కొరటాల స్క్రిప్టు లాక్ చేసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో.. ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్ డిజైన్ చేశాడట కొరటాల. ఆ పాత్రలో విజయశాంతి నటించబోతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఆమె పాత్ర ఎన్టీఆర్ అత్త పాత్ర అని టాక్. అంతేకాదు ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో ఈ పాత్రకు సంబంధించి ఒక భారీ ట్విస్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దాంతో ఎన్టీఆర్ 30 పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇకపోతే గతంలో కొరటాల-ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ మంచి హిట్‌గా నిలిచింది. దాంతో మరోసారి ఈ కాంబో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమంటున్నారు. మరి నిజంగానే విజయ శాంతి ఇందులో నటిస్తుందా లేదో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.