కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడో యాత్రలో విషాదం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి గుండెపోటుతో మృతి చెందారు. పంజాబ్ ఫిలోర్ వద్ద యాత్ర చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. దీంతో వెంటనే నేతలు, కార్యకర్తలు ఆయనను హాస్పటల్ కు తరలించగా మార్గ మధ్యలోనే కన్నుమూశారు. ఈ ఉదయం రాహుల్ పాదయాత్ర ప్రారంభించగా.. జలంధర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ పాల్గొన్నారు.
రాహుల్ గాంధీతో కలిసి ముచ్చటించుకుంటూ కాసేపు నడిచిన ఆయన.. ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. రాహుల్..వెంటనే సంతోక్ సింగ్ ను ఫగ్వారాలోని విర్క్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. రాహుల్ గాంధీ జోడో యాత్రకు విరామం ఇచ్చి చౌదరి సంతోక్ ను చూసేందుకు ఆసుపత్రికి వెళ్లారు. సంతోక్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతోక్ సింగ్ చౌదరీ అకాల మృతిపట్ల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ట్విట్టర్లో సంతాపం ప్రకటించారు. ఆయన ఆకాల మరణం తనను బాధించిందన్నారు.