KNR: జమ్మికుంటలో 19వ వార్డును మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్, వైస్ ఛైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ కలిసి సందర్శించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డులోని సమస్యలను తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, తాగునీటి సరఫరా సమస్యలపై ప్రజలు ఆయనకు వినతి పత్రం అందజేశారు. నీటి వృథా నివారణకు ప్రతి ఇంట్లో వాల్వులు ఏర్పాటు చేసుకోవాలన్నారు.