HNK: దక్షిణ కాశీగా పేరుగాంచిన హన్మకొండలోని స్వయంభు సిద్ధేశ్వర ఆలయంలో గల సిద్దేశ్వరస్వామికి ఆర్చకులు ఈరోజు ప్రత్యేక అలంకరణ చేశారు. పాల్గుణమాసం, త్రయోదశి తిదీ, మాసశివరాత్రి, మంగళవారం సందర్భంగా వివిధ రకాల పూలు, వస్త్రంతో స్వామికి అలంకరణ చేసి, పూజలు చేసారు. అలాగే అన్నాభిషేకం నిర్వహిచారు. భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు.