»Minister Botsa Says Janasena Will Disappears Till Ugadi
Minister Botsa: వచ్చే ఉగాదికి జనసేన పార్టీ ఉంటే గుండు గీయించుకుంటా: మంత్రి బొత్స
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. వచ్చే ఉగాదికి జనసేన, టీడీపీ నామరూపం లేకుండా పోతాయన్నారు. ఆ రెండు పార్టీలు ఉంటే తాను గుండు కొట్టించుకుంటానని అన్నారు.
ఏపీలో పొలిటికల్ హీట్ ఎక్కువైంది. ఎన్నికలు(Elections) దగ్గరపడుతున్న నేపథ్యంలో పోటాపోటీగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం సాగుతోంది. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగత విషయాలను ఎత్తిచూపుతూ నిందాపరోణలు చేసుకుంటున్నారు. తాజాగా జనసేన(Janasena) అధినేత పవన్ విశాఖలోని రుషికొండ(Rushikonda) పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ(Ycp) సర్కార్‌పై విరుచుకుపడ్డారు.
మరోవైపు జనసేన పార్టీ(Janasena Party)పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa satyanarayana) ఫైర్ అయ్యారు. వచ్చే ఉగాది నాటికి జనసేన, తెలుగుదేశం పార్టీలు ఉండవని, ఆ రెండు ఉంటే తాను గుండు కొట్టించుకుంటానని మంత్రి బొత్స శపథం చేశారు. వైసీపీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..వైసీపీ, టీడీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఆ రెండు పార్టీలకు లేవన్నారు.
ఎన్నికలు వచ్చినప్పుడే టీడీపీ(Tdp), జనసేన పార్టీలకు ప్రభుత్వ స్కీములు గుర్తుకొస్తాయన్నారు. కొంతమంది నేతల మాట్లాడితే తమ చేతులు, కాళ్లు చూపిస్తున్నారన్నారు. చెప్పుతో కొడతామని విపక్షాలు చేస్తోన్న వ్యాఖ్యలపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పుడు అందరికీ ఉంటాయనే విషయం ఆ రెండు పార్టీలు గుర్తించుకోవాలన్నారు. జనసేన తన రాజకీయ దుకాణం తెరిచి పదిహేనేళ్లు అయ్యిందని, వారి రాజకీయాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం, రాజకీయాలంటేనే అసహ్యం వేస్తోందన్నారు.