NLR: బుచ్చి( M)లో రోడ్డు ప్రమాదాల నివారణకు సీఐ శ్రీనివాసరావు చర్యలు చేపట్టారు. పట్టణంలోని టోల్ ప్లాజా వద్ద దూరప్రాంతాలకు వెళ్లే వాహనాలను ఆపి డ్రైవర్లతో ఫేస్ వాష్ చేయించారు. వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయంలో డ్రైవర్లకు నిద్రమత్తు వచ్చినట్లుగా అనిపిస్తే వాహనాలను పక్కన నిలిపి విశ్రాంతి తీసుకుని బయలుదేరి వెళ్లాలన్నారు.